ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర గుంటూగవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రు పశ్చిమ మండలంలోని చల్లావా రిపాలెంలో శుక్రవారం నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభా కార్యక్రమంలో పాల్గొటారని, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారితో కలసి అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షిం చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనాన్ని గవర్నర్ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. సభా వేదిక ఏర్పాటు, షామియానా, కుర్చీలు, బారికేట్లు, తాగునీరు సౌకర్యం, వాహ నాల పార్కింగ్ వంటి ఏర్పాట్లను పకడ్బందిగా చేయాలన్నారు. సభా వేదిక పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం సజావుగా చేపట్టాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేటట్లు చూడాలని చెప్పారు. గవర్నర్ తోపాటు రాష్ట్ర, జిల్లా ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్, ఆర్‌డిఒ పి.శ్రీఖర్, జెడ్పి సిఇఒ జె.మోహన్‌రావు, డిటిసి కరీం, డిపిఒ కె.శ్రీదేవి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ శ్రావణ్‌బాబు, డిఎఒ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.