ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పశర్లపాడులోని లక్ష్మీప్రసన్న ఫెర్టిలైసెర్స్, విఘ్నేశ్వర ఫెర్టిలైసెర్స్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. అనుమతుల్లేకుండా విక్రయిస్తున్న రూ.11.58 లక్షల ఫెర్టిలైసెర్స్, పెస్టిసైడ్, బయో స్టిములెంట్స్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 8.25 టన్నుల ఎరువులు, 134.6 లీటర్ల పురుగు మందులు, 91.5 లీటర్ల బయో స్టిములేంట్స్ విక్రయాలను నిలిపేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవసాయాధికారి కె.రమణ కుమార్, ఎస్‌ఐ వి.రామచంద్రయ్య, వ్యవసాయాధికార్లు పాల్గొన్నారు.