రియల్ ఎస్టేటు వేసిన దృశ్యం
అక్రమ రియల్ ఎస్టేట్లు..-
చర్యలకు అధికారులు వెనుకంజ
..ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ఇటీవల కాలంలో అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఏర్పాటు చేస్తున్న వెంచర్లే అధిక శాతం వెలుస్తుండడం గమనార్హం. అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు భిన్నంగా మిన్నకుండి పోతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దల అండ ఉండడంతో అక్రమ వెంచర్లపై అధి కారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలిసింది. పెద్దల అండ ఉండడంతో ప్రచారం జరుగుతున్న అక్రమ వెంచర్ గురించి సేకరించిన మేరకు వి వరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నరుకూరు నుంచి కోడూరు వె ళ్లే ఆర్ అండ్ బి రోడ్డు (స్టేట్ బ్యాంక్ పక్కన) సర్వే నంబర్ 7/1, 7/2, 8, 9/ఏ, 9/బి, 10 ఏ లలోని సుమారు 8.50 ఎక రాల్లో కౌస్తుభం ఎస్టేట్స్ డివైన్ సిటీ పేరుతో ఓ వెంచర్ వెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మించిన ఈ వెంచర్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించి రెండు (న్యూ బాలాజీ రావు) పారుదల కాలువలు వెళుతు న్నాయి. రియల్ ఎస్టేట్ యాజమాన్యం ఇరిగేషన్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ రెండు పారుదల కాలువలను పూడ్చివేసి ప్లాట్లు నిర్మించడం గమనార్హం. వైసీపీ పెద్దల అండతోనే రియల్టర్లు దర్జాగా ఇరిగేషన్ కాలువలను కబ్జా చే శారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే అధి కా రులు చర్యలు తీసుకొనేం దుకు చొరవ చూపడం లేదని తెలుస్తోంది. వెంచర్ యాజమాన్యం వైసీపీ అధిష్టానం పేర్లు చెప్పి అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోందని వినికిడి. ఈ ప్రాంతంలో ఎకరాభూమి విలువ దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి పారుదల శాఖ అనుమతి లేకుం డా కోట్లాది రూపాయలు విలు వైన ఇరిగేషన్ శాఖ భూమి ఆ క్రమణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమ రియల్ ఎస్టేట్ నిర్మాణంపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆ స్తులకు రక్షణ కల్పించాలని నరుకూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు.