రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలలో పద్మావతి విద్యార్థినుల ప్రతిభ

రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలలో పద్మావతి విద్యార్థినుల ప్రతిభ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 19 విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థి నులను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.భువనేశ్వరి అభినం దించి ప్రశంశా పత్రాలు, మెడల్స్‌ని అందించారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతోపాటు మనోరంజక సాధనలో ముఖ్య భాగమని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు డి.మునివేని సిఈఎల్‌, రెజ్లింగ్‌ గోల్డ్‌ మెడల్‌, జిమ్నాస్టిక్‌ లో బ్రాంజ్‌ మెడల్‌, జి గంగానీలావతి సిఇసి రెజ్లింగ్‌ లో సిల్వర్‌ మెడల్‌, టి. ఆరతి సిఇసి, కరాటేలో సిల్వర్‌ మెడల్‌, టెక్వాన్లో బ్రాంచ్‌ మెడల్‌, కె పల్లవి బైపిసి, కరాటేలో బ్రాంజ్‌ మెడల్‌, ప్రథమ సంవత్సరం విద్యార్థినులు చాతుర్య, సిఇసి జిమ్నాస్టిక్స్‌ లో గోల్డ్‌ మెడల్‌, సి వైశాలి రెజ్లింగ్‌ లో సిల్వర్‌ మెడల్‌, 2 గోల్డ్‌ మెడల్స్‌ 4 సిల్వర్‌ మెడల్స్‌ 2 బ్రాంజ్‌ మెడల్స్‌ ఇందులో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థినులను, వీరికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్‌ డైరెక్టర్‌ సాయి సుమతిని ప్రిన్సిపాల్‌, డాక్టరు జయమ్మ, అధ్యాపకులు అభినందించారు.

➡️