ప్రజాశక్తి-రామాపురం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలం నల్లగుట్టపల్లెలో నిర్వహించిన వైనీడ్స్ ఎపి జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నల్లగుట్టపల్లె సచివాలయ పరిధిలో వివిధ పథకాల ద్వారా జరిగిన అభివద్ధిని తెలిపే బోర్డ్‌ను శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించి ఏఏ పథకం ద్వారా ఎంతమేలు జరిగిందో ప్రజలకు వివ రించారు. 45 ఏళ్ళు దాటిన అక్కాచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 అందు తోందన్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా రుణాలు మాపీ చేస్తామని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసగించారన్నారు. జగన్ నాలుగన్నరేళ్ల పాలనలో మూడుసార్లు డ్వాక్రా రుణమాఫీ, నాలుగు సార్లు అమ్మఒడి, మూడు సార్లు చేయూత, పాఠశాలల అభివద్ధి, రాయచోటి పట్టణంలో నాలుగు అర్బన ్‌హెల్త్ సెంటర్లు, వంద పడకల ఆస్పత్రి, రైతుబజార్, బస్‌స్టాండ్ విస్తరణ, రహదారుల విస్తరణ, శిల్పారామం, నగరవనం, తదితర అభివద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్య క్రమంలో మాజీ ఎంపిపి గడికోట జనార్దన్‌రెడ్డి, జడ్‌పిటిసి మాసన వెంకట రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధరెడ్డి, స్థానిక సర్పంచ్ నాగ భూషన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంవెంకట సుబ్బారెడ్డి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, వైస్ ఎంపిపిలు రవి శంకర్‌రెడ్డి, బాబు, సింగల్ విండో అధ్యక్షులు పెద్దిరెడ్డి, ఆదినారాయ ణరెడ్డి, సత్యాయాదవ్, శ్రీధర్‌రెడ్డి, ఆంజనే యులు పాల్గొన్నారు.రామసముద్రం : మండలంలోని ఎలువనెల్లూరు పంచాయతీ కేంద్రంలో సర్పంచి ఉదరు శంకర్ రెడ్డి ఆద్వర్యంలో వై నీడ్ ఎపి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఎలువనెల్లూరు గ్రామ పంచాయతీకి నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 24 కోట్లు రూపాయలు సంక్షేమ పథకాలు రూపంలో అందా యని అన్నారు. పైగడ్డ నుండి పిల్లిగుండ్లపల్లి వరకు, గజ్జిగంగనపల్లి వరకు రోడ్లు పూర్తి చేసామని తెలిపారు. తర్వాత కోటి రూపాయల పైనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు కోటి రూపాయల పైనే ఖర్చు చేశామన్నారు. కార్యక్రమంలో ఈఒఆర్డి సుధాకర్ రెడ్డి, ఎంపిపి కుసుమ కుమారి, జడ్పిటిసి సిహెచ్ రామచంద్రా రెడ్డి, ఎంపీటీసీ మూగవాడి రెడ్డెప్ప, రెడ్డి శేఖర్, మాజీ ఎంపిటిసి దొడ్డిపల్లె ఆనంద, ఈశ్వర్ , మాజీ సర్పంచ్ కత్తి వాలెప్ప, సిహెచ్ ప్రకాష్ , ఎస్ సి సెల్ క్రిష్ణప్ప, కేశవ పాల్గొన్నారు. వీరబల్లి : ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థతో పేదల ఇంటా సంక్షేమ కాంతులు వెళ్లి విరుస్తున్నాయని ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వీరబల్లి పంచాయతీలో వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్ర మాన్ని నిర్వహించారు. వైసిపి నాయకులతో కలిసి సంక్షేమ అభివద్ధి బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి శివరాంగౌడ్, ఎంపిడిఒ మల్లేశ్వరి, వైసిపి యువనాయకుడు వీరనాగిరెడ్డి, జెసిఎస్ కన్వీనర్ నరేష్, పంచాయతీ సెక్రటరీ చంద్రుడు, ఎస్‌సి సెల్ రామ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.చిన్నమండెం: మండలంలోని టి.సాకిబండ గ్రామ సచివాలయంలో గురువారం ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పథకాల బోర్డు పార్టీ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్ర మంలోఎంపిటిసి రత్నమ్మ, మాజీ ఎంపిటిసి వెంకట్రామిరెడ్డి, వైసిపి నాయ కులు మహమ్మద్ షరీఫ్, సాయిపీర్, ప్రతాప్‌రెడ్డి, జెసిఎన్ మండల కన్వీనర్ చుక్కఅంజనప్ప, శ్రీరాములు, రమంజులు రెడ్డి,ఫయాజ్, సత్యం పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి