ప్రజాశక్తి – రాయచోటి భారత రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, అందుకు ప్రతి భారతీయుడు తన వంతు కషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం 74వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు భారతీయ పౌరుడిగా కషి చేయడం మన బాధ్యత అన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివద్ధి, అభ్యున్నతిని కాంక్షించి రచించిన రాజ్యాంగ గ్రంథాన్ని 26 నవంబర్ 1949న జాతికి అంకితం చేసి రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్న విషయాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే రోజున జాతీయ న్యాయ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాలను కూడా నిర్వహించుకుంటున్నామన్నారు. త్యాగానికి, కషి, సడలని పట్టుదల, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అకుంఠిత దీక్షాదక్షతలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ .బి.ఆర్. అంబెడ్కర్ నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఆయన మేథా నిరతికి.. రెండు చేతులు జోడించి హదయ పూర్వక అభినందనలు, కతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.అనంతరం డిఆర్‌ఒ సత్యనారాయణ భారత రాజ్యాంగ గ్రంథంలోని పీఠికను చదివి వినిపించారు. అనంతరం భారత రాజ్యాంగం భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం అని, న్యాయ చట్టాల పరిరక్షణకు తమ వంతు కషి చేస్తామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏవో బాలకష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రాజ్యాంగాన్ని కాపాడుకుందాంఐదవ అదనపు జిల్లా జడ్జి కష్ణన్ కుట్టి భారతదేశంలోని సర్వజనుల హక్కులను కాపాడే విధంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాయచోటి ఐదవ అదనపు జిల్లా జడ్జి కష్ణన్ కుట్టి అన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన రోజును పురస్కరించుకుని రాయచోటి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ కార్మికులతో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 జనవరి 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారని అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26 ను రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపు కుంటున్నామని, 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తాహిర్‌బాష,న్యాయవాది ఉదయగిరి రామాంజనేయులు, మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ వెంకట కష్ణారెడ్డి, మున్సిపాలిటీ కూలీల యజమానులు సురేంద్రబాబు, శ్రీరాములు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.