అంబేద్కర్‌కి నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ
రాజ్యాంగ దినోత్సవం
ప్రజాశక్తి-కందుకూరు :భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులు అందరిపై ఉందని ఎంఎల్‌ఎ మానుగుంట మహిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తన కార్యాలయంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ పితామహుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచారన్నారు.