ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌అనేక మతాలు, కులాలు, జాతులు, తెగలు కలిసి జీవిస్తున్న భారతదేశానికి లౌకిక రాజ్యాంగం అత్యంత అవసరమని, లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. స్థానిక చైతన్య నగర్‌లో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎస్‌డి షర్మిళ, పౌర సమాఖ్య నాయకులు దారా వెంకటేశ్వర్లు.. ఐద్వా నాయకులు పి సామ్రాజ్యం, డి నాగమణి, సిహెచ్ అనిత, వీ.రమాదేవి, పి నాగమణి, కె.సునీత, సిహెచ్ గురవమ్మ, పాల్గొన్నారు.