ప్రజాశక్తి-రేపల్లె: ప్రతి వ్యక్తి భారత రాజ్యాంగానికి లోబడి జీవించినప్పుడే నమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్ అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని తెలిసికొని, విధుల్ని గౌరవించినట్ల యితే అంబేడ్కర్ కోరుకున్న సమసమాజం స్థాపించవచ్చు నని అన్నారు. సమాజంలో ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. రంగు, కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా, పరమత సహనం కలిగి వుండాలని, రాజ్యాంగ పీఠికను ప్రతి ఒక్కరూ గౌరవించా లని చెప్పారు. భారత పౌరులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడేందుకు రాజ్యాంగంలో సమానత్వపు హక్కు, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్య్రపు హక్కు, దోపిడీని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు విద్య, సాంస్కతిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచి వీటి పరిరక్షణ బాధ్యతలను న్యాయస్థానాలకు అప్పగించిందన్నారు. మార్టూరు రూరల్: భారతదేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను రాజ్యంగంలో పొందుపర్చడం వల్ల భారత రాజ్యాంగం సువిశాల రాజ్యాంగంగా ఆవిర్భవించిందని మార్టూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అక్కేశ్వరరావు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్‌ఐ ముసలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగం రూపకల్పనకు కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ కార్యాలయ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.