ప్రజాశక్తి-రాయచోటి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు అందించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ విసి హాల్‌లో ఓటర్ జాబితా సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందించిన ఫిర్యా దులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటర్ జాబితాకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా పేపర్ మీద క్లియర్‌గా రాసి ఇవ్వాలని కలెక్టర్ రాజకీయ పార్టీ నాయకులకు సూ చించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శని, ఆదివారం రెండు రోజులు పోలింగ్ కేంద్రాలలో నిర్వహించే ప్రత్యేక శిబిరా లలో బిఎల్‌ఒలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా ఉంటారని అర్హత ఉన్న ఓటర్లందరూ ఓటు హక్కు నమోదు చేసుకో వాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతి గ్రామంలో మైకుల ద్వారా ముమ్మర ప్రచారం చేయించాలని ఆర్‌డిఒలకు తెలిపారు. ఈ నెల 9 లోపు పెండింగ్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. బల్క్‌గా అందిన దరఖాస్తులపై ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగు పరిష్కారం చేయాలన్నారు. అర్హులైన ఒక్క ఓటర్ను కూడా తొలగించరాదని స్పష్టం చేశారు. చేర్పులు తొలగింపులు మ తులు సంబంధించి బిఎల్‌ఒలు రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. నిరంతరం ఓటర్ల జాబితా స్వచీకరణ పనిలో నిమగం కావాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అతి ముఖ్యమైనదని 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 18 ఏళ్లు పూర్తయిన వారం దరినీ ఓటర్లుగా నమోదు చేసుకునే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జనవరి-1, 2024కి, 18 ఏళ్లు వచ్చేవారు ఓటరుగా నమోదు చేసుకో వచ్చన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ 18 ఏళ్లు పూర్తయిన వారందరినీ ఓటర్‌గా నమోదు చేసేందుకు క షి చేయా లన్నారు. జంక్ క్యారెక్టర్స్, 10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండింగ్‌లో ఉన్న వాటికి సంబం ధించి ఇంటింటి సర్వేలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఓటర్ల జాబితాలో సవరిస్తామన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాలో ఇవిఎంలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి సెక్టార్లో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ప్రజలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన నిర్వహిస్తామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లె, రాజంపేట ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, రామకృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, పాల్గొన్నారు.