రహదారిని పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి మున్సిపల్‌ పరిధిలోని మోడల్‌ స్కూల్‌ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. మోడల్‌ స్కూల్‌ వద్ద నుంచి జగనన్న కాలనీ వరకూ ఉన్న రహదారిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గఫార్‌ మాట్లాడుతూ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ సహకారంతో జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌తో మాట్లాడి రహదారిని వీలైనంత త్వరలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రహదారి పూర్తయితే మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు సౌకర్యంగా ంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దాసరి మురళి, పెద్దన్న పాల్గొన్నారు

➡️