రసాభాసగా కౌన్సిల్‌ సమావేశం

ప్రజాశక్తి-మదనపల్లి మదనపల్లె పురపాలక సంఘం సమావేశం అధికార పార్టీకి చెందిన కౌన్సిల్‌ సభ్యులు వాగ్వావాలతో రసాభాసగా మారింది. గురువారం కౌన్సిల్‌ హాలులో చైర్‌పర్సన్‌ మనూజారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గత నెల 31వ తేదీన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలిపిన వాటిని తమ పార్టీ చెందిన ఐదుగురు కౌన్సిలర్లు డీసెంట్‌ తెలపడంపై ఆ అంశాలను తిరిగి ఈ కౌన్సిల్‌లో చేర్చడం సరికాదని దీనిపై వివరణ ఇవ్వాలని చైర్పర్సన్‌, కమిషనర్‌ను వైస్‌ చైర్మన్‌ జింక వెంకటాచలపతి వివరణ కోరారు. ఐదుగురు సభ్యులు డీసెంట్‌ తెలపడంతో కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లి ఆ అంశాలను తిరిగి అజెండాలో చేర్చామని చైర్‌పర్సన్‌ తెలిపారు. చలపతి, కౌన్సిలర్లతో చైర్‌ పర్సన్‌ పోడియం వద్దకు వెళ్లి మెజార్టీ కౌన్సిలర్లకు అవమానం చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ నిబంధన ప్రకారం మినిట్స్‌లో రాసిన తర్వాత అభ్యంతరాలు తెల వడం ఏంటని ప్రశ్నించారు. చైర్‌పర్సన్‌ ఆ ఐదుగురు సభ్యులు కూడా కౌన్సిల్లోని సభ్యులు కదా అని ఆమె అనడంతో రసాభాసగా మారింది. అజెండాలోని అంశాలపై చర్చ ఆగిపోగా మినిట్స్‌ను కౌన్సిల్‌ హాల్‌ల్లోనే చైర్పపర్సన్‌ అనంతరం కౌన్సిల్‌ సభ్యులు అందరూ కూర్చుంటే రాసి వినిపిస్తానని తెలిపారు. తమ పార్టీ కౌన్సిలర్లే చైర్‌పర్సన్‌గా ఉన్నా తనపై ఇలా ప్రవర్తించడం సరికాదని ఆమె తెల్ప డంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కౌన్సిల్‌ సభ్యులందరూ చైర్‌పర్సన్‌ మినిట్స్‌ రాయాలని పట్టు పట్టడంతో ఆమె సమావేశం మధ్యలోనే లేచి తన ఛాంబర్‌లోకి వెళ్లి రాస్తానని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం ఆమె ఛాంబర్‌లోకి తిరిగి వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు అందరూ వెళ్లి మినిట్స్‌ రాయాలని పట్టుబడ్డారు. అక్కడ నుండి కూడా ఆమె వెళ్లి పోయారు. గత నెల కౌన్సిల్‌ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ జింక వెంకటాచలపతితో సహా ఐదుగురు సభ్యులు మినహా కౌన్సిల్‌ సమావేశం నుండి వినితిగారు. కౌన్సిల్‌ సమావేశం నుంచి చైర్‌పర్సన్‌ మధ్యలోనే వెళ్లిపోవడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. గత నెలలో జరిగిన అంశంపై ఎంపీ వద్ద పంచాయితీ జరిగిందని, అందుకు ఒకే పార్టీకి చెందినవారు ఇలా వర్గాలుగా విడిపోవడం సరికాదని ఆయన చెప్పారని అందువలన అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఏది ఏమైనా స్వపక్షంలోనే విపక్షం లాగా వ్యవహరించడం గ్రూపు రాజకీయాలకు తావిచ్చినట్లు అవుతుందని పలువురు చర్చించుకున్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

➡️