ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ మండల యూటీఎఫ్ నూతన కమిటీ ఎంపిక జరిగింది. దాచూరి రామిరెడ్డి అనసూర్యమ్మ యుటిఎఫ్ సిఐటియు కార్యాలయంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు జై కేశవరాజు ఆధ్వర్యంలో ముందుగా సమావేశం నిర్వహించారు. అనంతరం మండల కమిటీని ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షులుగా ఎల్ బాలకోటయ్య, అధ్యక్షులుగా వల్లభుని శంకరరావు, సహాధ్యక్షులుగా వై రంగయ్య, ఎన్విసి ఉమ, మండల ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి వెంకయ్య, కోశాధికారిగా జే ప్రభాకర్‌రావు, మహిళా కార్యదర్శిగా ఏ హిమబిందు, మండల కార్యదర్శిగా ఎన్ సురేంద్ర, ఎస్ ప్రసాదరావు, వి వెంకటేశ్వర్లు, ఎస్ సునీల్ కుమార్ రెడ్డి, పి వలి, ఎన్ చెంచు రామారావు, మహిళా కమిటీ కన్వీనర్‌గా సిహెచ్‌వి కృష్ణకుమారి, కో-కన్వీనర్‌గా పి ఆండాలమ్మ, ఆడిట్ కమిటీ డి బాలకోటయ్య, కే శ్రీధర్, సాంస్కతిక కమిటీలో బి శ్రీనివాస్‌రెడ్డి, పి ఆంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారులు కోటపాటి నారాయణ, మహంకాళి నరసింహారావు, యుటిఎఫ్ సీనియర్ నాయకులు టి రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు.