ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దష్టి పెట్టాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడి యో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఓటర్ జాబితా సవరణపై ఆర్‌డిఒలు, తహ శీల్దార్లు, బిఎల్‌ఒలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ18-19 వయసు ఉన్న యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తగువిధంగా అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాలో అర్హులైన ఓటర్లు వందశాతం నమోదు కావాలని ఇందుకు మండ లాలలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ప్రయివేటు కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒకరిని ఓటర్‌గా ఎన్‌రోల్ చేయించాలన్నారు. తహశీల్దార్లు, బిఎల్‌ఒలు ఓటు హక్కు గురించి ఓటు ప్రాధాన్యత గురించి విద్యా ర్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫారమ్ 6 ఫారమ్-7, ఫారమ్-8 పెండిన్సిలు, అన్ ప్రాసెస్డ్ అప్లికేషన్లను ఎప్పటికప్పుడూ పూర్తి చేసి అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దష్టి సారించి త్వరగా పరిష్కారం చేయాలన్నారు. రాజ కీయ పార్టీల ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని చెప్పారు. క్లెయిమ్స్ డిస్పోజల్ చేసేటప్పుడు నాణ్యతగా చేయాలన్నారు. జిల్లాలో డుప్లికెట్ ఓటర్లు, ఇతర ప్రదేశాలకు వలస పోయిన వారు, మరణించిన వారు, కొత్తగా వివాహం అయ్యి వేరే ఊళ్లకు వెళ్లిన వారు, వంటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ అధికారులు ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.