యువత దేశ ఆర్థిక ప్రగతికి చోదకంగా నిలవాలి

యువత దేశ ఆర్థిక ప్రగతికి చోదకంగా నిలవాలి

ప్రజాశక్తి-విశాఖపట్నం : యువత ఆలోచనలు దేశ ఆర్థిక ప్రగతికి, పురోభివృద్ధికి చోదకశక్తిగా నిలవాలని మిజోరాం రాష్ట్ర గవర్నర్‌ కె.హరిబాబు అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎండోమెంట్‌ లెక్చర్‌లో ఆయన ‘విద్యార్థి యువజన ఉద్యమాలు- దేశ ప్రగతిలో యువతకు అవకాశాలు’ అంశంపై హరిబాబు ప్రసంగించారు. 1965 తరువాత జరిగిన వివిధ విద్యార్థి ఉద్యమాలను ఆయన ప్రస్తావించారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన విద్యార్థి ఉద్యమం, విశాఖ ఉక్కుసాధన ఉద్యమంలో విద్యార్థుల భూమిక, 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో ముల్కి నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం, 1974లో జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం, 1975 నాటి ఎమర్జన్సీ పరిస్థితులు, 1979లో అస్సాంలో ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ ఉద్యమం వంటివి వివరించారు. విద్యార్థి ఉద్యమాలు తర్వాతి కాలంలో అనేకమందిని జాతీయ నాయకులుగా తీర్చిదిద్దాయన్నారు.

➡️