ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
యుటిఎఫ్ సీనియర్ నాయ కులు కె.బ్రహ్మాజీరావు(80) వయోభారంతో శుక్రవారం రాజమహేంద్రవరంలోని తన సొంతి ఇంట్లో మృతి చెందారు. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు యుటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షునిగా సేవలందించారు. యుటిఎఫ్ పత్రిక, ఐక్య ఉపాధ్యాయ పత్రికకు సంపాద వర్గంగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమానికి కషి చేశారు. ఆయన మృతికి యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీప్ సంతాపం తెలిపారు. యుటిఎఫ్ నాయకులు బ్రహ్మాజీ రావు భౌతికకాయాన్ని సందర్శించారు. యుటిఎఫ్ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 25న లింగపేటలోని బ్రహ్మాజీరావు ఇంటి వద్ద సంతాప సభ జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ సంతాప సభకు పిడిఎఫ్ ఎంఎల్సిలు హాజరవుతారని తెలిపారు. జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రాంతీయ, మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంక్షేమ పథకం బాధ్యులు, కార్యకర్తలు, నాయకులు ఈ సభకు హాజరుకావాలని కోరారు.
యుటిఎఫ్ సీనియర్ నేత బ్రహ్మాజీరావు భౌతికకాయంపై యుటిఎఫ్ జెండాను కప్పి నివాళులర్పిస్తున్న నాయకులు