యాజమాన్య హక్కులు చారిత్రాత్మకం.

Nov 25,2023 17:39
కిట్‌ అందజేస్తున్న మంత్రి కాకాణి

యాజమాన్య హక్కులు చారిత్రాత్మకం..
-వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్‌ రెడ్డి..
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:
అసైన్డ్‌ భూములు, భూమి కొ నుగోలు పథకం (ఎల్‌పిఎస్‌), గ్రామ సేవా ఇనాం (బహుమతి) భూముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మో హన్‌ రెడ్డి తీసుకొన్న నిర్ణయం చారిత్రాత్మకమ ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పే ర్కొన్నా రు. శనివారం తోటపల్లిగూడూరు ఎంపీ డీవో కార్యాలయంలో అసైన్డ్‌ భూములను సాగు చే సుకుంటున్న రైతులకు, చుక్కల భూములకు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన భూ ములకు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పట్టాలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మా ట్లాడుతూ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఈ చారిత్రాత్మిక నిర్ణయం తీసుకొన్నారన్నారు. ము ఖ్యమంత్రి తీసుకొన్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యా ప్తంగా లక్షల ఎకరాల భూమిపై లక్షల మంది పేద లకు లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు. ప్ర భుత్వం ఇచ్చే అసైన్డ్‌ భూముల లబ్ధిదారులలో అధిక శాతం నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలు ఉన్నార న్నారు. అయితే వారికి స్పష్టమైన యాజమాన్య హక్కులు లేవని అయన చె ప్పారు. సరైన యా జమాన్య పత్రాలు లేకపోవడంతో వాటి క్రయవి క్రయాలపై లబ్ధిదారులకు ఎటువంటి హక్కులు లేకుండా పోయాయాని మంత్రి గోవర్ధన్‌ రెడ్డి తెలి పారు. అయితే సీఎం భూ యాజమాన్యం హ క్కులు కల్పించడంతో లబ్ధిదారులకు అన్ని హ క్కులు పొందే అవకాశం లభించిందని అయన చె ప్పారు. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఎల్‌పీఎస్‌ కింద రుణాలు పొంది కొనుగో లు చేసిన లక్షలాది ఎకరాల భూమిపై పేద రైతు లకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి పూర్తి హక్కులు క ల్పించినట్లు మంత్రి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. చివ రకు ఆ భూములపై వున్న రుణాలు సైతం సీఎం మాఫీ చేశారన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి తీ సుకొన్న మరొక విప్లవాత్మక నిర్ణయం రీ సర్వే అ న్నారు. 100 ఏళ్ల తర్వాత చేపట్టిన రీ సర్వే ద్వా రా 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత హ క్కు పత్రాలు అందాయని మంత్రి కాకాణి చెప్పా రు. అలాగే 45 వేల సరి హద్దు వివాదాలను పరి ష్కరం అయ్యయన్నారు. ఏదేమైనా అసైండ్‌, ఎ ల్పిఎస్‌ భూములకు యాజమాన్యం హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మో హన్‌ రెడ్డి తీసు కొన్న సంచల నిర్ణయం భారత దేశ చరిత్రలో చి రస్థాయిగా నిలిచిపోతుందని, దాంతో రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి మళ్ళీ జగన్మో హన్‌ రెడ్డిని సీఎం చేయాలని మంత్రి గోవర్ధన్‌ రెడ్డి కో రారు. కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్‌ ఉప్పల శం కరయ్య గౌడ్‌, ఎంపీ పీ స్వర్ణలత, సచివాలయా ల కన్వీనర్‌ తలమంచి సురేంద్ర బాబు, ఏఎంసి డైరెక్టర్‌ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్‌, జెడ్పిటిసి శే షమ్మ, మాజీ జెడ్పిటిసి చిరంజీవి గౌడ్‌, ఈదూరు రామాచా ర్యులు, అధికారులు, వైసీపీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️