మొక్కజొన్న స్టార్చ్‌ ఉత్పత్తి యూనిట్‌కు శంకుస్థాపన

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో రూ.144 కోట్లతో 32.94 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మొక్కజొన్న నుండి స్టార్చ్‌ ఉత్పత్తి యూనిట్‌కు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో సిఎం జగన్‌ బుధవారం శంఖుస్థాపన చేశారు. కొమ్మూరులో ఏర్పాటు చేయస్తున్న శ్రీవెంకటేశ్వర బయోటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ గ్రౌండ్‌ బ్రేకింగ్‌ను వర్చువల్‌గా సిఎం ప్రాంభించారు. అనంతరం ఎపి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ బి.లావణ్య వేణి స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కజొన్న నుండి స్టార్చ్‌, ఇతర ఉత్పత్తుల తయారీకి ప్రతిపాదనలు పెట్టామన్నారు. ఒకసారి ప్రారంభించిన తరువాత ఈ యూనిట్‌ రోజుకు 300 టన్నుల మొక్కజొన్నను ప్రొసెస్‌ చేయగలదన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 210 మందికి పరోక్షంగా 100 మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బయోటెక్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ కాశీవిశ్వనాధం, ఎపిఎఫ్‌పిఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆదిశేషు, సిపిఒ శ్రీనివాస్‌, ఇండిస్టీస్‌, డిస్ట్రిక్ట్‌ రిసోర్సుపర్సన్లు పాల్గొన్నారు.

➡️