ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్ : తమ భవనాన్ని అక్రమ లీజుతో ఆక్రమించి వ్యాపారం చేస్తున్న పయనీర్ ఆటో మొబైల్స్ యాజమాన్యం తక్షణమే ఖాళీ చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు చేపట్టిన ధర్నా మంగళవారానికి 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాము రెండు వారాలుగా ధర్నా చేస్తున్నా షాపు నిర్వాహకులు జవ్వాజి సాంబశివరావు మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆయన చర్యలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. జవ్వాజి సాంబశివరావు ధోరణిని తాము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆయన చర్యలను ఎండగడతామని చెప్పారు. ధర్నాలో ప్రతాపరెడ్డి, రామారావు, శృంగారం, ఎ.ప్రభుదాస్, రామకోటయ్య, పోతులూరయ్య, చంద్రయ్య, కెబిఆర్‌జె ప్రసాద్, రమాదేవి, నాయుడు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.