మైనార్టీల హక్కుల కోసం కృషి : ఆవాజ్‌

Nov 29,2023 19:26
మాట్లాడుతున్న ఆవాజ్‌ నాయకులు

మాట్లాడుతున్న ఆవాజ్‌ నాయకులు
మైనార్టీల హక్కుల కోసం కృషి : ఆవాజ్‌
ప్రజాశక్తి -నెల్లూరు : సమాజంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రషీద్‌ పేర్కొన్నారు. బుధవారం ఆవాజ్‌ (మైనారిటీ డెవలప్మెంట్‌ ఫోరమ్‌) ఆవిర్భవించి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆవాజ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో బ్రైడ్లు, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రషీద్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీ సంక్షేమ పథకాలు దూరం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్‌ లు తీసివేయగా కేంద్రం స్కాలర్షిప్‌ ను తీసివేసి మైనారిటీలను మరింత వెనుకబాటుకు గురిచేస్తుందన్నారు. ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు సయ్యద్‌ రఫీ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సి వంటి పోరాటాలు జరిగి నప్పుడు ఆవాజ్‌ లౌకికత్వం తో కుల, మతాలకు అతీతంగా అందరితో కలిసి పోరాడిందని ఆవాజ్‌ చేసే పోరాటాలలో మైనారిటీలు భాగస్వామ్యం కావాలన్నారు. జిజిహెచ్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ కాలేషా బాషా మాట్లాడుతూ ఆవాజ్‌ హక్కుల కోసం పోరాటమే కాకుండా సామాజిక సేవ చేయడం కూడా చాలా మంచి పరిణామం అని రాబోయే రోజుల్లో ఆవాజ్‌ మరింత ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌ సంధాని, ఆవాజ్‌ జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ రియాజ్‌ , మహమ్మద్‌ సర్దార్‌, సయ్యద్‌ ఆన్సర్‌, షేక్‌ మీరా, సయ్యద్‌ రవూఫ్‌, షేక్‌ ఫయాజ్‌, షేక్‌ నజీర్‌, రూరల్‌ ,నగర కమిటీల సభ్యులు హాజరయ్యారు.

➡️