ప్రజాశక్తి – చింతకొమ్మదిన్నె ఏరువాక కేంద్రం ఊటుకూరు ఆత్మ, కడప వారి సహకారంతో చిరుధాన్యాల విలువ జోడింపు నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రంలో మూడవ రోజు శుక్రవారం మిల్లెట్ కేకు తయారు చేసే ప్రయోగాత్మక తరగతులు నిర్వహించారు. పులివెందులలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. నజ్మా హఫీజా రిసోర్స్ పర్సన్లుగా విచ్చేసి శిక్షకుల సందేహాలను నివత్తి చేశారు. అనంతరం వారు చిరుధాన్యాల ప్రాసెసింగ్ కోసం వివిధ స్టేజిల గురించి, చిరుధాన్యాల విలువ జోడింపునకు అవసరమయ్యే యంత్ర పరికరాలు, అవి లభ్యమయ్యే ప్రదేశాలు, వాటికయ్యే ఖర్చు వివరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆత్మ డీపీడీ పి.పద్మలత, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎస్.రామలక్ష్మి దేవి,యువ రైతులు, మహిళా రైతులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.కెవికెలో పుట్టగొడుగుల పెంపకంపై.. పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచి ఆహారమని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రామలక్ష్మిదేవి పేర్కొన్నారు, శుక్రవారం స్థానిక కషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో పుట్టగొడుగుల పెంపకంపై పాల పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ పుట్టగొడుగులు మంచి ఆహారమని భవిష్యత్తులో అందరూ పౌష్టికాహారంపై మొగ్గుతూపుతారని చెప్పారు. యువతీ యువకులు ఇలాంటి ఉపాధి కల్పించే కార్యక్రమంలో పాల్గొని, ఒక కుటీర పరిశ్రమ పెట్టి మంచి లాభాలు గడించాలని ఆ ఆకాంక్షించారు, కార్యక్రమంలో కెవికె సమన్వయకర్త డాక్టర్ వీరయ్య శాస్త్రవేత్తలు డాక్టర్ శిల్పకళ, సాయి మహేశ్వరి, మానస, స్వామి చైతన్య పాల్గొని ప్రసంగించారు.