ప్రజాశక్తి-రామచంద్రపురం
సీనియర్ సివిల్ జడ్జి కె.మాధవీదేవి సేవలు అభినందనీయమని జూనియర్ సివిల్ జడ్జి వి.నాగేశ్వరరావు నాయక్ అన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కె.మాధవీదేవి బదిలీ అయిన సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలి కారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి మురళీమోహన్ మాట్లాడుతూ 26 నెలలు న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె బార్ అండ్ బెంచ్ మధ్య సహృద్బావాన్ని నెలకొ ల్పారని అన్నారు. నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ కె.మాధవీదేవి న్యాయ పరమైన అంశాలపై, విచారణలు, తీర్పులి వ్వడమే కాకుండా, సామాజిక దృష్టితోఅనేక సమస్యలు పరిష్కరించారని అన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యవర్గం మాధవీదేవికి దుశ్శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి సన్మానించారు. కార్యక్రమ ంలో కార్యవర్గ సభ్యులు సత్యవాణి, చిన్నం వీరెడ్డి, పిల్లా పధ్వీ, వివిఆర్.సుబ్రహ్మణ్యం, వి.గోపాల రావు, బినరు బాబు, ఆర్‌విజి.మణిబాబు, అల్లం గనిరాజు, శాస్త్రి, దొమ్మలపాటి సత్య నారా యణ, ఐ.గంగా ధర్, కెవివి.సత్యనారా యణ, జాన్ రత్నం తదితర న్యాయ వాదులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్‌జడ్జి కె.మాధవీదేవిని సన్మానిస్తున్న దృశ్యం