మహిళా మార్ట్‌ సందర్శన

ప్రజాశక్తి-మద్దిపాడు – మద్దిపాడులోని మహిళా మార్ట్‌ను గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన గ్రామీణ జీవనోపాధుల (ఎస్‌ఆర్‌ఎల్‌ఎం) బందం బుధవారం సందర్శించారు. డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ తేళ్ళ రవికుమార్‌ వైఎస్‌ఆర్‌ చేయూత మహిళా మార్ట్‌ విధి విధానాల గురించి గురాజత్‌ బృందానికి వివరించారు. 13,500 మంది సభ్యుల భాగస్వాములు వాటా డబ్బులతో మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్ట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో సభ్యులందరికీ హక్కు ఉంటుందని తెలిపారు. మహిళా మార్ట్‌లో స్వయం సహాయక సంఘం సభ్యులు కుటుంబాల నుంచి వచ్చిన జీవనోపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గురాజత్‌ బృందం ఇనమనమెల్లూరు గ్రామంలో పిఎంఇజిపి, పిఎం ఎఫ్‌ఎంఇ ద్వారా నెలకొల్పిన తేనె పరిశ్రమ, గానుగ ద్వారా నూనె తీసే యంత్రాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహాయక సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. రుణాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు? తిరిగి అప్పులు ఎలా చెల్లించారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ ఎస్‌ఆర్‌ఎల్‌ఎం టీం సభ్యులు ఐఎఎస్‌ పుష్పలత, ఓందేశ్‌ సీన్హ చూడ్సమా, నిమిషారాత్‌ వా, వీరేంద్ర బాసియ్య, మయూరి వాదియ, ఎస్‌సిఆర్‌పి డిజిఎం కె. కేశవ, ప్రకాశం జిల్లా బ్యాంకు లింకేజీ డిపిఎం బి సుబ్బారావు, ఐబి డీపీఎం కపారావు, చేయూత డిపిఎం రాంబాబు, ఎస్‌ఎన్‌పాడు ఏరియా కోఆర్డినేటర్‌ విజయమ్మ, ఎపిఎం నరేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

➡️