ప్రజాశక్తి-శింగరాయకొండ : తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా ఉంటుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీలోని పొనుగోటివారిపాలెంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైసిపి ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించారు.తెలుగు దేశం అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారన్నారు. ఈ కారక్రమంలో టిడిపి నాయకులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కూనపురెడ్డి వెంకట సుబ్బారావు, చిగురుపాటి శేషగిరి, కనిగిరి వెంకటేశ్వర్లు, నరాల సుధాకర్, మందలపు గాంధీ చౌదరి, ఇమ్మడిశెట్టి రామారావు, పాకల సర్పంచి సైకం చంద్రశేఖర్, చీమకుర్తి శ్రీకాంత్, సుదర్శి ప్రసాద్ రావు, కల్లగుంట నరసింహ, పొనుగోటి కొండయ్య, షేక్ యస్ధాని, షేక్ సంధాని బాషా తదితరులు పాల్గొన్నారు.