ప్రజాశక్తి-గుంటూరు : ఐక్యరాజ్య సమితి 2023 నాటికి మహిళలపై హింసలేని సమాజాన్ని చూడాలని కోరుకుంటోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. గురజాడ అప్పారావు 108వ వర్ధంతి సందర్భంగా మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజీలో ‘హింసలేని సమాజం, స్త్రీల ప్రాధాన్యత’ అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమాదేవి మాట్లాడుతూ స్త్రీ, పురుష అసమానతలు, సమాజంలో స్త్రీల ప్రాధాన్యత, హింసలేని సమాజంపై ప్రసంగించారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఐద్వా పోరాడుతోందని చెప్పారు. డాక్టర్ రమేష్‌బాబు మాట్లాడుతూ గురజాడ రచనలు సమాజంలో మహిళలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్లు, ప్రిన్సిపాల్ డాక్టర్ జె.అప్పారావు, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసకుమార్, అడ్మిషన్ డీన్ డాక్టర్ రమేష్‌బాబు, ప్రొఫెసర్ జె.కిషోర్‌బాబు పాల్గొన్నారు.