నాగులుప్పలపాడు : సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మట్టిగుంట గ్రామానికి చెందిన రావూరి అశ్వినికి జీవనోపాధి నిమిత్తం దాతలు ప్రమోద్ మన్యం రూ.15వేలు, శిల్పా రాఘవేంద్ర రూ.10వేలు, నరేంద్ర చింతం రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. అశ్విని భర్త సతీష్ ఏడాది క్రితం చనిపోయాడు. కుటుంబ పోషణకష్టంగా మారడంతో ఒంగోలులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ బాషాను ఆమె ఆశ్రయించింది. తమ కటుంబ పోషణ నిమిత్తం ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీంతో ట్రస్ట్ తరుపున దాతల సహకారంతో ఇస్త్రీ పెట్టె, తోపుడు బండి, మూడు నెలలకు సరిపడ బియ్యం నిత్యావసర సరుకులు, నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి షేక్ సర్దార్, ఒంగోలు నగర అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు, మట్టిగుంట మూడవ వార్డు మెంబరు, సిపిఎం నాయకులు కె.సుబ్బారావు,సుబ్బారెడ్డి పాల్గొన్నారు.