మహాధర్నా జయప్రదానికి పిలుపు

సమావేశంలో పాల్గొన్న కార్మిక రైతు సంఘాల నాయకులు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం యుటిఎఫ్‌ ఎంప్లాయిస్‌ హోమ్‌ వద్ద శుక్రవారం కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్‌ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్ష వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కర్షక, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జింఖానా గ్రౌండ్‌ లో జరిగే మహా ధర్నాకు కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న హక్కుల కోసం కార్మికులు కర్షకులు సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు సత్తిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రరావు అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాంబాబు, గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు నిమ్మకాయల వెంకటేష్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శంకర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నిమ్మకాయల శ్రీను, అంగన్‌వాడీ జిల్లా కోశాధకారి అమూల్య, బేబీ గంగ రత్నం, విత్తనాల రాంబాబు, రామకృష్ణ, విజయ ఆశ వర్కర్‌ యూనియన్‌ నాయకులు ఈశ్వరి, భువనేశ్వరి పాల్గొన్నారు.

 

➡️