ప్రజాశక్తి-చీమకుర్తి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు,రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27,28 తేదీలలో విజయవాడలో 36 గంటల పాటు నిర్వహిస్తున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు కోరారు. స్థానిక పంగులూరి కృష్ణయ్య భవనంలో బుధవారం నిర్వహించిన సిఐటియు నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బి.వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిసిగ్గుగా కార్పొరేట్ల సంపద పెరిగే విధంగా విధానాలను అమలు చేస్తుందన్నారు. దీంతో కార్మికులు,రైతులు,ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.రైతు పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు.చిన్న,చిన్న పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయి, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పల్లామల్లి ఆంజనేయులు, నాయకులు పూసపాటి వెంకటరావు, ఇ.నాగయ్య, శ్రీను, సురేష్,జి.అయ్యల నాయుడు, కనకరాజు,ఏడుకొండలు, సర్వన్, రాఘవరెడ్డి, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం : రైతు సమస్యలపై ఈనెల 27 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం, ఎపి సంయుక్త కిసాన్‌మోర్చా, వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం, సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవెండ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులకు గరువుతున్నారు. అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్నారు. నాలుగు లేబర్ కోడులను ఉపసంహరించు కోవాలని, కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్, కంటింజెంట్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డీకే.రఫీ, పట్టణ కార్యదర్శి పి. రూబేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుమ్మా బాలనాగయ్య, దగ్గుపాటి సోమయ్య, సిపిఐ నాయకులు అందే నాసరయ్య, గుండాల కాశయ్య రైతు సంఘం నాయకులు దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి, శంకర్, రాజశేఖర్ రెడ్డి, బాణాల రామయ్య, రేపు తిరుపతయ్య కెవిపిఎస్ నాయకులు జె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తిలో మాట్లాడుతున్న కాలం సుబ్బారావు