మత్స్యకారుల సంపద పెంపునకు కృషి

ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలో మత్స్య కారులందరికీ అందుబాటులో ఉంటూ వారి సంపద పెంపునకు కషి చేస్తానని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్‌. సుస్మిత పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో మత్స్యశాఖ కారులకు, కార్మికులకు, కుటుంబాలు ప్రభుత్వం నుంచి అందే సబ్సీడీలను ఎలా పొందాలి, జీవనాధారం ఏవిధంగా చేయాలో ఆమె ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు. అన్నమయ్య జిల్లాలో మత్స్యశాఖ కార్యాలయాల వివరాలు తెలపండి? అన్నమయ్య జిల్లాలో మత్స్య కార్యాలయాలు బహుదా, పీలేరులలో, సహాయ మత్యశాఖ కార్యాలయం రాజంపేట, మత్స్యశాఖ అభివద్ధి కార్యాలయంలో మదనపల్లిలో ఉన్నాయి. గాలివీడు, గుర్రంకొండ, నిమ్మనపల్లె, పెద్దమండెం, వాల్మీకిపురం, చిన్నమండెం, బి. కొత్తకోట, కురబలకోట, మదనపల్లె, ములక చెరువు, పెద్ద తిప్పి సముద్రం, రామసముద్రం,, తంబళ్లపల్లె, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, కలకడ, కంభంవారిపల్లె, పీలేరు, ముండుపల్లె, సంబేపల్లి, చిట్వేలు, నందలూరు, ఓబులవారిపల్లె పుల్లంపేట, పెనగలూరు, రైల్వే కోడూరు, రాజంపేట, వీరబల్లిలో సబ్‌ డివిజన్‌ కార్యాలయాలున్నాయి. మత్స్యశాఖ అధికారుల పని వివరాలు తెలపండి? మత్స్య శాఖలో చేప పిల్లలు పెంచడం, చెరువులు లీజుకు ఇవ్వడం, లైసెన్స్‌ రిజర్వాయర్లలో మత్స్య కారులకు లైసెన్సుల మంజూరు చేయడం, ప్రభు త్వ పథకాలాన్నిటిని మత్స్య కారులకు అందజేయడం అధికారుల ముఖ్య విధి. జిల్లాలో చెరువులు, లైసెన్స్‌ రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా 149 చెరువులు, 2 లైసెన్స్‌ రిజర్వాయర్లున్నాయి. చేపల చెరువులకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. సిఎం, పిఎం మత్స్యశాఖలో పథకాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానమంత్రి మత్యశాఖకు సంబంధించి యువజన పథకం కింద ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలున్నాయి. చేపల మార్కెటింగ్‌ కోసం మినీ ఫిష్‌ రిటైల్‌ యూనిట్‌ కాస్ట్‌ రూ. లక్ష నుండి రూ. 3 లక్షల వరకు, రూ. 10 లక్షల నుండి రూ 50 లక్షల వరకు షాప్‌లకు ఫుడ్‌ ఐటమ్స్‌ను విక్రయించడానికి అనుమతులు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో ఇస్తున్నాం. మత్స్య శాఖకు సంపాదన ఏవిధంగా పెంచుతున్నారు? మత్స్యశాఖ ద్వారా రెండు రకాలు ఆదాయ పెంపుదలకు కృషి చేస్తున్నాం ప్రధానమంత్రి మత్స్య సంపద యువజన పథకం (పిఎంఎంఎస్‌) ద్వారా శాఖా పరంగా గుర్తించిన చెరువులలో సీడ్‌ చేసి, లైసెన్స్‌ రిజర్వాయర్లలోలో చేప పిల్లలను వదలడం ద్వారా చేపల వద్ధి చెందడానికి చర్యలు చేపడుతున్నాం .మత్స్య శాఖ ద్వారా ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? చెరువులలో చేపల పెంపకం, రవాణా ద్వారా డ్రైవర్లకు, కూలీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటితో పాటు మత్స్య కారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అమలు చేస్తున్నాం.జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్‌. సుస్మిత

➡️