మతోన్మాద ప్రభుత్వంతో దళితహక్కులకు ప్రమాదం

Nov 27,2023 00:21 #KVPS, #palnadu

చిలకలూరిపేట: దళిత హక్కులను కాపాడుకోవడానికి డిసెంబర్‌ 4వ తేదీన ఢిల్లీలో జరగనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవి పిఎస్‌) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవి బాబు అన్నారు. డిసెంబర్‌ 4న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా మండల పరిధిలోని మురికిపూడిలో సంతకాల సేక రణ శనివారం రాత్రి వరకు జరిగింది. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌, మతోన్మాద బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాం గానికి, దళితుల హక్కులకు ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాస్తూ మతోన్మాద అజెం డాను ప్రజల్లోకి తీసుకెళ్తోందని విమర్శిం చారు. దళితు లకు రక్షణగా ఉన్న ఎస్సి,ఎస్ట్టి అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేవిధంగా మార్పులు చేసి దళితుల రక్షణను ప్రమాదంలో పడేటట్టు చేసిందని విమర్శించారు. లౌకిక భారత రాజ్యాంగాన్ని, దళిత హక్కులను కాపాడు కొని సామాజిక న్యాయం సాధించడానికి దళిత సోషణ్‌ ముక్తి మంచ్‌, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర అనేక దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే మహా ధర్నాలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్య క్రమంలో దళిత నాయకులు జె.ఆదిబాబు, పున్నారావు, సుధాకర్‌, యెహోషువ, అనిల్‌ పాల్గొన్నారు.

➡️