ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్ జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భైరవకోనలో పూజలు చేశారు. ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి, సీనియర్ సివిల్ జడ్జి కే శ్యాంబాబు, ఎక్సైజ్ కోర్టు జడ్జి అర్ వెంకటేశ్వర శర్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కే భరత్ చంద్ర, కే భవ్య తదితర న్యాయమూర్తులు శనివారం భైరవకోన విచ్చేశారు. అక్కడి జలపాతాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గాదేవి భర్గులేశ్వర, నగరేశ్వర, కాలభైరవ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ సిద్దు రమణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సిద్దు వెంకటరెడ్డి, ఆలయ పూజారులు కంబాలదిన్నె వెంకట నరసయ్య, పంచాగ్నుల రామమూర్తి శర్మ, సుధాకర్‌శర్మ న్యాయమూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయమూర్తులను ఘనంగా సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాపరెడ్డి, నారాయణస్వామి ఆలయ ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ దుగ్గిరెడ్డి జయరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ బైరెడ్డి తిరుపతిరెడ్డి, సీఐ కే శ్రీనివాసరావు, ఎస్‌ఐ అనిల్ కుమార్ ఉన్నారు.