భవిష్యత్‌పై అవగాహన కల్పించాలి

ప్రజాశక్తి-మార్కాపురం : విద్యార్థులు చదువులో రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని, దేశానికి వారి అవసరం ఎంతైనా ఉందని, భవిష్యత్‌ ఉన్నతంగా, దేశానికి ఉపయోగపడేలా ఉండటం కోసం అవగాహన కల్పించాల్సిన అవసరముందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత టి.ఎన్‌.జగన్నాథ్‌ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక జడ్‌పి బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపా ధ్యాయుడు మునగాల చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన ‘గెస్ట్‌ ఏ కలెక్టర్‌’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ తోట చందన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌ నిర్మిం చుకోవడంలో మనం చేయాల్సిన గురుతర బాధ్యతను గుర్తు చేశారు. విద్యార్థులు ఎదగడం అనేది రేపటి భారతదేశానికి పునాది అన్నారు. మార్గదర్శిని జిల్లా అబ్జర్వర్‌ మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రమ శిక్షణ, సరైన పట్టుదలతో సాధిం చాలన్నారు. గట్టిగా కషి చేస్తే భవిష్యత్తు అంతా మీదేనని విద్యార్థులను ప్రోత్స హించాలన్నారు. కలెక్టర్‌ అతిథిగా డాక్టర్‌ శేషుకుమార్‌ జర్నలిజం, సైకాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌ అంశాలపై అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కెరీర్‌ గైడెన్స్‌ మెంటార్స్‌ సమీఉల్లా , వెంకట్రామిరెడ్డి, ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, స్టాఫ్‌ సెక్రటరీ ప్రభాకర్‌రెెడ్డి, ,ఉపాధ్యాయులు, విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️