ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని మివీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా పంచాయతీరాజ్ ఇఇలు, డిఇలతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య భవనాలైన సచివాలయాలు, ఆర్‌బికెలు, హెల్త్ క్లినిక్స్‌ను నిర్దేశించిన గడువులోగా కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాj ుతీరాజ్ ఎస్‌ఇ. కొండయ్య, ఇఇలు, డిఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు. స్థానిక స్పందన హాలులో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలపై పంచాయతీ రాజ్ ఇంజినీర్లు, ఎంపిడిఒలకు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల లక్ష్యాలను నిర్ణయించి పూర్తి చేయడంలో ఇంజినీర్లు వెనుకబడి ఉన్నారన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల అంచనాల కంటే అదనపు అంచనాలతో రికార్డు చేపిన పర్చూరు పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ జోషిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్‌ఇ హరి నారాయణ, డిపిఒ దాసరి రాంబాబు, డిఆర్‌డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్ రావు,ప్రకాశం జిల్లా జడ్‌పి సిఇఒ జాలి రెడ్డి, ఎంపిడిఒలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ప్రకాశం