ప్రజాశక్తి – పెద్దాపురం
స్థానిక మహారాణి సత్రం వ్యవస్థాపకురాలు, రాజా వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ మహారాణి 188 వ వర్ధంతిని బుధవారం మహారాణి సత్రంలో ఘనంగా నిర్వహించారు. సత్రం కార్యనిర్వహణాధికారి కాట్నం జగ న్మోహన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప మాట్లా డుతూ 1882లో మహారాణి స్థాపించిన ఈ సత్రంలో రాజేసిన పొయ్యి ఈనాటికి ఆరకుండా అన్నదానం నిర్వహించబడటం చిన్న విషయం కాదన్నారు. ఈ సత్రం అన్నదానంలోనే కాకుండా విద్యాదానంలో కూడా రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి లు మాట్లాడుతూ మహారాణి ఆశయ స్ఫూర్తితో ఈ సత్రంను అన్నదానంలో ఉన్నత స్థితిలో నిలపాలన్నారు. అనంతరం పేదలకు వస్త్ర దానం, అన్నదానం నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి ముందు సత్రం ఆవరణలోని మహారాణి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ చల్లా ఉదయబాబు, కౌన్సిలర్లు బి.వీర వెంకట దుర్గా, సత్య భాస్కరరావు, ఎ.వీరరాఘవ, వి.రాజా, కోఆప్షన్ సభ్యుడు షేక్ రఫీ, టిడిపి నాయకులు తూతిక రాజు, రంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.