ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో సోమ వారం వెలుగు చూసిం ది. ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు మండలం మల్లవరానికి చెందిన రేచల్రెడ్డి (19) పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఎన్ఇసి కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ హాస్టల్లోనే ఉంటున్న రేచల్రెడ్డి సోమవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారని, వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారని కాలేజీ యాజమాన్యం తెలిసింది. తలకు రాసుకునే వాస్మాల్-33 ఆయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కాలేజీ యజమాన్యం తెలిపింది. విద్యార్థిని మృతి వార్తను కుటుంబీకులకు తెలపగా వారొచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు.