కనిగిరి : బాల్య వివాహాల రహిత కనిగిరే థ్యేయమని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తెలిపారు. కనిగిరి-7 సచివాలయం వద్ద బాల్య వివాహాల నిరోధక కమిటీ చైర్మన్ గఫార్ అధ్యక్షతన వార్డు బాల్య వివాహాల నిరోధక కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కిశోర బాలికల సర్వే , అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గ్రామ, వార్డు స్థాయిల్లో వివాహాల వివరాలు సేకరించాలని, కిశోర బాలికల వివాహలపై తీసుకున్న చర్యలు,పునరావాస ప్రణాళిక పై తీసుకున్న చర్యలు, కిశోర బాలికల కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని తీర్మానించారు. తొలుత మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, ఎస్‌బిసిసి జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వార్డును బాల్య వివాహల రహిత వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల మొదటి శుక్రవారం బాల్య వివాహాల నిరోధక కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అడ్మిన్ సునీల్ కుమార్, ఎఎన్‌ఎం లక్ష్మి, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రేమ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ నవ కుమార్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.