బట్టల దుకాణం దగ్ధం

 ప్రజాశక్తి- తగరపువలస : స్థానిక మెయిన్‌ రోడ్డు వద్ద ఉన్న జస్వంత్‌ ఫ్యాషన్స్‌ రెడీ మేడ్‌ బట్టల దుకాణంలో ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. బట్టల దుకాణం పైఅంతస్తులో ఆ దుకాణ యజమాని కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందా? ఇంకేమైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. అసలే ఆదివారం సహజంగానే మెయిన్‌ రోడ్డులో జనం రద్దీగా ఉన్నారు. ఇంతలో అనుకోకుండా ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు, సంబంధిత దుకాణం, పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమానులు, పనిచేసే కార్మికులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి ఎక్కువ సంఖ్యలో జనం తరలిరావడంతో పోలీసులు వారిని అదు పుచేయడం కష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న చిట్టివలస ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 

➡️