ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని ఆర్‌టిసి చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రూ2.50 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తయిన బస్తాండ్‌ను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాష, జడ్‌పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధరెడ్డిలతో కలసి వారు పాల్గొ న్నారు. నూతన బస్టాండ్, డిపో మేనేజర్ ఛాంబర్, కార్యాలయం, జిల్లా ప్రాం తీయ రవాణా అధికారి కార్యాలయం, పార్సిల్ సర్వీసు, రిజర్వేషన్ కౌంటర్‌ల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకూ ప్రయాణీకుల రద్దీ దష్ట్యా బస్టాండ్‌ను విస్తరిం చాలన్న ఉద్దేశ్యంతో నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిఎం జగన్ దష్టికి తీసుకెళ్లగా రూ.2.50 కోట్ల నిధులును మంజూరు చేశారని పేర్కొన్నారు. బస్టాండ్‌కు పక్కనే ఉన్న రెవెన్యూ స్థలం 32 సెంట్ల విస్తీర్ణాన్ని క్యాబినెట్ ఆమోదం పొందేలా చేసి, ఈ స్థలాన్ని కలుపుకుని బస్టాండ్ నిర్మాణపు పనులును ప్రారం భించామన్నారు. పట్టణం రోజు రోజుకూ అభివద్ధి చెందుతోందని, రెండవ బస్టాండ్ నిర్మాణానికి కషి చేస్తున్నామన్నారు. బస్సు డిపోను కూడా అభివద్ధి పరుస్తామన్నారు. చిన్నమండెం, గాలివీడులలో బస్ స్టేషన్‌లు అధ్వాన్న స్థితిలలో ఉన్నాయని, వాటి అభివద్ధికి కషి చేయాలని ఆర్‌టిసి చైర్మన్‌ను శ్రీకాంత్‌రెడ్డి కోరారు. నియోజక వర్గంలో ప్రతి అంశంలోనూ పురోగతి సాధిస్తున్నామన్నారు. రాయచోటి నుంచి తిరుమలకు నేరుగా వెళ్లే సర్వీసును నడపాలని, కడపకు ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని కోరారు. లక్కిరెడ్డిపల్లెలో రూ.50 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణం, రామాపురంలో రూ.15 లక్షల ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో బస్ షెల్టర్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 2700 కొత్త బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. తిరుమల బస్సు సర్వీస్‌ను ప్రారం భిస్తామన్నారు. లక్కిరెడ్డిపల్లెలో త్వరితగతిన బస్ స్టాండ్ నిర్మాణాల పనులను చేపడతామన్నారు. రాయచోటి నుంచి హైదరాబాద్, విజయవాడలకు స్లీపర్ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షులు చిదం బర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు వండాడి వెంకటేశ్వర్లు, కర్ణపు విశ్వనాధరెడ్డి, సీనియర్ నాయకులు జమాల్ ఖాన్, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్,స్థానిక కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి,స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, ఎపిఐఐసి డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి, జడ్‌పిటిసి వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌టిసి ఇడి గిడుగు వెంకటేశ్వర రావు, జిల్లా ప్రజా రవాణా అధికారి రాము, డిఎం ధనంజయ, డిసిసిబి డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు బసిరెడ్డి సుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఆర్‌టిసి అధికారులు పాల్గొన్నారు.