ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Nov 27,2023 19:42
కార్డులు అందజేస్తున్న సర్పంచ్‌ బ్రహ్మయ్య,అధికారులు

కార్డులు అందజేస్తున్న సర్పంచ్‌ బ్రహ్మయ్య,అధికారులు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాశక్తి-కందుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కొండి కందుకూరు సర్పంచ్‌ కుమ్మర బ్రహ్మయ్య కోరారు. మండలంలోని కొండి కందుకూరులో వికసిత్‌ భారత సంకల్పయాత్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సర్పంచ్‌ బ్రహ్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలలో అవగాహన కల్పించేందుకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర సంకల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధానంగా గిరిజనులు, ఆదివాసుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు,చర్యలు గురించి ప్రజలకు వివరించడం దీని ప్రధాన ఉద్ధేశ్యం అని తెలిపారు. తొలుత ఇఒఆర్‌డి చంద్రసేన్‌ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉధ్యేశాన్ని వివరించి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్‌ అనసూయ, కషి విజ్ఞాన కేంద్రం సి టి ఆర్‌ ఐ సీనియర్‌ శాస్త్రవేత్త డా.జి.ప్రసాద్‌ బాబు, కందుకూరు మండల వ్యవసాయ అధికారి రాము, మెడికల్‌ అధికారిని షేక్‌ జూవేరిమాట్లాడారు. ఇంకా ఎపిఒ సుజాత, ఎపిఎం శ్రీనివాసులు వారి పధకాలను రైతులకు వివరించారు. ఉప సర్పంచి బ్రహ్మయ్య, సచివాలయ సిబ్బంది, ఆర్‌.బి.కె. సిబ్బంది, రైతులు, రైతు మహిళలు, గ్రామీణ యువత పాల్గొన్నారు.

➡️