ప్రజాశక్తి – కాకినాడ జగ్గంపేట రూరల్, గండేపల్లి అభివృద్ధి, సంక్షేమానికి ఇతర రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తోందని ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ 30వ డివిజన్లో కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర శివప్రసన్న, పసుపులేటి వెంకటలక్ష్మి పథకాల బోర్డును ఆవిష్కరించారు. రాగిరెడ్డి బన్ని, పెద్ది రత్నాజీ, మానే కష్ణమోహన్ పాల్గొన్నారు. జగ్గంపేట మండలంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమం కరుటూరి వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ జ్యోతుల చంటిబాబు పథకాల అభివృద్ధి బోర్డ్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా, ఒమ్మి రఘురాం పాల్గొన్నారు. గండేపల్లి మండలం పి.నాయకంపల్లిలో సర్పంచ్ మలిరెడ్డి అన్నపూర్ణ, మలిరెడ్డి పాపారావు ఆధ్వర్యంలో వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంఎల్ఎ జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఇ చలగళ్ల దొరబాబు, వైస్ ఎంపిపి కుంచే రాజా, అడబాల ఆంజనేయులు, తాళ్లూరి మధు కుమార్, ఉండవల్లి నారాయణమూర్తి, నిమ్మలపూడి శ్రీహరి, ఎంపిడిఒ వెంకట రామన్, మూర్తి, పోతుల శిరీష పాల్గొన్నారు.