ప్రజాశక్తి – పెద్దాపురం
రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాబోయే ఎన్నికల్లో వైసిపిని మరోసారి గెలిపించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు పిలుపు నిచ్చారు. మండలంలోని కట్ట మూరు గ్రామంలోని 1, 2 సచివాలయాల పరిధిలో వై ఎపి నీడ్ జగన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గత నాలుగున్నరేళ్ల పాలనలో సిఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, ఎంపిపి పెంకే సత్యవతి, వైస్ ఎంపిపి మిరియాల రాజా, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం, ఎంపిటిసి సభ్యులు నల్లల సూర్యకుమారి, ఉప్పటి ప్రసాద్, పిఎసిఎస్ ఛైర్మన్ చల్లా చినవీర్రాజు, జోడు గుడులు దేవస్థానం ఛైర్మన్ మేడిద వెంకట రామారావు, గోపు మురళి, వినుకొండ వీర విష్ణుచక్రం, తదితరులు పాల్గొన్నారు