ప్రజాశక్తి – కడప పేదింటి ఆడ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అపురూపమైన గొప్ప కానుకలు వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అని జిల్లా కలెక్టర్ వి.విజరు రామరాజు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకం నాల్గవ విడత ఆర్థిక సాయాన్ని.. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసి హాలు నుంచి కలెక్టర్‌తోపాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మంత్రి ఆది మూలపు సురేష్,ఎ మ్మెల్సీ రామ చంద్రయ్య, ఎమ్మెల్యేలు రవీంద్ర రెడ్డి, రఘురామ రెడ్డి, హజ్ హౌస్ చైర్మన్ గౌస్ లాజం, మైనారిటీ కార్పొరేషన్ సభ్యులు హిదాయతుల్లా, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ పి. శివ ప్రసాద్ రెడ్డి, పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు పాకా సురేష్ äజరయ్యారు.వ ుుఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం ఈ పథకానికి సంబంధించి వైఎస్‌ఆర్ జిల్లాలో వివాహం చేసుకున్న అర్హులైన 478 జంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3,95,10,000 లను మెగా చెక్కు రూపంలో కలెక్టర్ అతిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం పదో తరగతి నిబంధనను అమలు చేస్తూ ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఏడాదిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకానికి సంబంధించి అర్హులను ఎంపిక చేస లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫాలను పెళ్లి కుమార్తె తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, డీఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, ఆయా సంక్షేమ శాఖల అధికారులు, లబ్ది పొందిన వధూవరులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.