పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పథకాలను ప్రజలకువివరిస్తున్న ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి

ప్రజాశక్తి-ఆలమూరు

పేదల సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని కొత్తపేట ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండలంలోని చొప్పెల్ల సచివాలయం-1లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ దంగేటి చంద్రకళ బాపనయ్య అధ్యక్షతన వైసీపీ మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాసు, ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి సభ్యులు తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, ఎఎంసి ఛైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తిరుగుతూ వివరించారు. రాష్ట్రంలో వైయస్సార్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే చేరుస్తున్న ఏకైక సిఎం జగన్‌ మాత్రమేనన్నారు. ప్రజలు వైసిపి ప్రభుత్వ హయాంలో అధికారులతో సుపరిపాలన కొనసాగాలని ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డికి మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ఒక్క వైసిపి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దానికి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చాయన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివద్ధి కొనసాగుతుందన్నారు.కార్యక్రమంలో వైసిపి నాయకులు కర్రి నాగిరెడ్డి, జాంపోలు మాణిక్యం, వాసన రాజు, దియ్యన పెద్దకాపు, ఉప సర్పంచ్‌ తోరాటి దుర్గారావు, ఎంపిడిఒ జాన్‌ లింకన్‌, పంచాయతీ కార్యదర్శి ఎం.శ్యామ్‌ సుందర్‌, సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడిలు పాల్గొన్నారు.

 

 

➡️