పేదల సంక్షేమమే థ్యేయం : ఎంపిపి

ప్రజాశక్తి- దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు మండలం మాధవరంలో గ్రామ సర్పంచి తాటికొండ రేణుక అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు, జడ్‌పిటి మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అందరికీ సమ న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు యాడిక శ్రీనివాసరెడ్డి, కుమ్మిత జయరామిరెడ్డి, సర్పంచులు సుబ్బారావు, వలి, ఎంపిడిఒ యువకీర్తి, పంచాయతీ కార్యదర్శి దేవదానం, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీరు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. పెద్దారవీడు : మండల పరిధిలోని తోకపల్లి గ్రామంలో వైఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో పేదల జీవితాలు బాగుపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి ఏరువ చలమారెడ్డి, ఎంపిపి బెజవాడ పెద్దగురవయ్య, సర్పంచి జిల్లెల మల్లీశ్వరి, ఎంపిటిసి ఉప్పలపాటి భాగ్యరేఖ, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ శొంఠి నాగార్జునరెడ్డి, నాయకులు రామచంద్ర యాదవ్‌, మేకల కాశయ్య, ఉప్పలపాటి దానం, ఉప్పలపాటి శ్యామ్‌బాబు, నరాల వెంకటనారాయణ, వల్లెల ఈశ్వర్‌రెడ్డి, జిలెల్ల గాలిరెడ్డి, తాళ్లూరి సాయికష్ణ, చేతుల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

➡️