ప్రజాశక్తి – ముదినేపల్లిముదినేపల్లిలోని ఆర్సియం సహాయ మాత చర్చి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముదినేపల్లిలోని పోల్రాజ్ కెనాల్ గట్టుపై నివసిస్తున్న వందమంది ఎస్టిలకు(యానాదులు) పునీత విన్సెంట్ డిపాల్ సొసైటీ ఆధ్వర్యంలో సమకూర్చిన చలి దుప్పట్లను విచారణ కౌన్సిల్ ఛైర్మన్ పోలాకు అప్పారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ మాతంగి మరియ కుమార్, సహాయ గురువులు విజరు కుమార్, సంఘ పెద్దలు ముత్యాల జోసఫ్ రాజు, పంతగాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.