ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 26వ వార్డు పరిధి రామకృష్ణనగర్, చాకలిపేట వద్ద రూ.16.30 లక్షల వ్యయంతో నూతన పార్కు నిర్మాణం కోసం వార్డు వైసిపి ఇన్‌ఛార్జి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యాన ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్స్ సేద తీరేందుకు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా పార్కు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ శ్రీనివాసరాజు, ఎఇ నిహారిక, జెసిఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ బొడ్డేటి కిరణ్, డైరెక్టర్ పాండవ శ్రీను, నాయకులు గండ్రేటి రవిబాబు, నవాబ్, బాబ్ జాన్, ఫరూక్, సుశీల, శేషు, రాము, హరి, గౌస్య, లలిత, విజయ లక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.