ప్రజాశక్తి-రాయచోటి పారిశ్రామిక రంగ అభివద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ గిరీష అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామంలో రూ.15.92 కోట్ల అంచనాతో 89.72 ఏకరాలలో అభివద్ధి చేయనున్న నూతన పారిశ్రామికవాడకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ గిరీష, డిఆర్‌ఒ సత్య నారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ ఎ.జయలక్ష్మి, ఎపిఐఐసి మేనేజర్ ఎం.ఉదరు కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్ సమావేశం అనం తరం వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న నూతన పారిశ్రామికవాడ శిలాఫలకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో పారిశ్రామిక రంగం వేగంగా అభివద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ద్వారా సూక్ష్మ, చిన్న సంస్థల క్లస్టర్ అభివద్ధి కార్యక్రమం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాల్మీకిపురం మండ లం తాటిగుంటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నూతన పారి శ్రామిక వాడలో వివిధ కంపెనీల స్థాపనకు 89 ప్లాట్స్ అభివద్ది చేస్తామని చెప్పారు. ఈ పారిశ్రామిక వాడలో రూ.15.92 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన చేస్తా మని పేర్కొన్నారు. అంతర్గత రోడ్లు, స్లాబ్ కల్వర్టులు, స్ట్రోమ్ నీటి పారుదల, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్స హించడంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే బి.కొత్తకోటలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, పీలేరు మండలం గూడరేవులపల్లిలో సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించామన్నారు. పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివద్ధి చెందు తుందిని జిల్లాలో నూతన పరిశ్రమలను స్థాపించేందుకు అధికారులు పారిశ్రా మికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో తరచుగా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి నూతన పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుం టున్నామన్నారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను మార్గదర్శకాలను అనుసరించి గడువులోగా ఆయా శాఖల ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఇందుకు వివిధ బ్యాంకుల ద్వారా అర్హత మేరకు రుణ మంజూరు కూడా చేస్తామని తెలిపారు. ముఖ్యంగా వైయస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన యూనిట్లను త్వరితగతిన స్థాపించేందుకు బ్యాంకు రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టవంతం చేసి జిల్లా ఆర్థిక అభివద్ధికి కషి చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.