పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం

Nov 29,2023 19:31
మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం
ప్రజాశక్తి-నెల్లూరు : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పారిశ్రామిక కవేత్తలకు ప్రభుత్వం తరపున సహా, సహకారాలు అందిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పలు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వర్చువల్‌ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమానికి నగరంలోని కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలు నుంచి కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, ఎపిఎంఐపి పిడి శ్రీవాసులు, ఇండిస్టీస్‌ జిఎం సుధాకర్‌, ఏపిఐఐసి జెడ్‌ఎం విజయరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి ముత్తుకూరు మండలం వేస్ట్‌ నాగులదొరువు గ్రామంలో రూ. 250 కోట్లతో నిర్మించిన గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (వంట నూనెల కంపెనీ) ప్రారంభోత్సవం, ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంలో రూ. 23.43 కోట్లతో ఎంఎస్‌ఎంఈ- సిడిపి ఇండిస్టియల్‌ పార్క్‌ రెండో దశ మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వర్చువల్‌ పద్దతిలో శంకుస్థాపన చేశారు. కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ అది óకారులతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తూ వివిధ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆత్మకూరు ఎంపిపి కెతా వేణుగోపాల్‌ రెడ్డి, గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ రామాంజనేయులు, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, ఇండిస్టీస్‌ జిఎం సుధాకర్‌, ఏపీఐఐసీ జడ్‌ఎం విజయరత్నం, సురేష్‌, శేఖర్‌ రెడ్డి ఉన్నారు.

➡️