పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

Nov 25,2023 21:10 #meo
ఫొటో : భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఇఒలు

ఫొటో : భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఇఒలు
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : దళితవాడ షబ్బీర్‌ కాలనీ పాఠశాలలను ఎంఇఒలు షేక్‌ మస్తాన్‌ వలి, తోట శ్రీనివాసులు శనివారం ఆకస్మిక తనిఖీ చేసి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వర్క్‌బుక్స్‌ పూర్తిగా రాశారా లేదా ఉపాధ్యాయులు కరెక్షన్‌ చేశారా సకాలంలో సిలబస్‌ పూర్తి చేశారా అని ప్రతి విషయాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు విద్యార్థుల సంఖ్యను బట్టి తగు మోతాదులో కందిపప్పు తదితర వస్తువులు వేసి మధ్యాహ్న భోజనము తయారు చేసే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని, మధ్యాహ్నం భోజనం రుచి చూస్తూ ప్రతిరోజు మెనూ ప్రకారం తప్పనిసరిగా రుచి శుచికరంగా భోజనం తయారు చేయాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడగ్గా చాలా బాగుందని చెప్పడంతో భోజనం రుచి చూసినా అధికారులు సంతృప్తి చెంది మధ్యాహ్న భోజన నిర్వాహకులను అభినందించారు. అనంతరం పాఠశాల అన్ని రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లియాఖత్‌అలీ, షబ్బీర్‌ ఉపాధ్యాయులు మున్నా, ఖలీల్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

➡️