దుంప తోటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
ప్రజాశక్తి-పెద్దాపురం
అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డిఎన్‌బివి.చలపతిరావు ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండల పరిధిలోని కట్టమూరు, వాలు తిమ్మాపురం, పట్టణ పరిధిలోని పలు కర్ర పెండలం దుంప తోటలను పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ చలపతిరావు మాట్లాడుతూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని దుంపతోటలను ఆఫ్రికా దేశం నుండి సోకిన పినో కాకస్ మానిహాటి అనే కొత్త రకం పిండి నల్లి ఆశించి తీవ్ర పంట నష్టానికి గురి చేసిందన్నారు. ఇప్పుడు నిర్వహించిన పరిశీలనలో దుంప తోటలను ఎర్రనల్లి, తెల్ల దోమ, మొజాయిక్ ఆశించినట్లు గుర్తించామన్నారు. వీటి నమూనాల సేకరించి వీటిలో పినోకాకస్ మానిహాటి ఉందేమో నిర్ధారణ కోసం బెంగళూరులోని ఎన్‌డిఎఐఆర్ కేంద్రానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఎం.జానకి, పెద్దాపురం ఉద్యాన అధికారి ఎన్.సుజాత,వి హెచ్‌ఎలు విజయదుర్గ, జ్యోతి, ఆర్‌హెచ్‌డబ్ల్యూఇపి విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.